Header Banner

టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్! ఏఐ సేవలు - భక్తులకు శాశ్వత ఐడీ! దర్శనం, వసతి ఇకపై!

  Fri May 23, 2025 10:09        Devotional

తిరుమలలో భక్తులకు ఏఐ అధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందు కోసం ఏఐ తో పాటుగా భక్తులకు శీఘ్ర దర్శనం.. వసతి ఇక నుంచి సాంకేతికత ద్వారా అమలు చేయనున్నారు. ఇందు కోసం టీటీడీ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. ప్రతీ కంపార్ట్ మెంట్ వద్ద ఏఐ కెమేరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జియో సంస్థ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ ముఖ చిత్రాలను నమోదు చేస్తోంది. ఏఐ సేవల కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ కేటాయించనున్నారు.


ఏఐ ఆధారిత సేవలు

తిరుమలలో సేవలను పూర్తిగా సాంకేతికత ఆధారంగా అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు అందించే సౌకర్యాలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లా కసరత్తు జరుగుతోంది. ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ద్వారా దర్శనం.. వసతి తో పాటుగా సేవల్లో నూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అదే విధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించటమే తొలి ప్రాధాన్యత గా టీటీడీ గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉచితంగా అందించేలా గుగూల్ ఇప్పటికే తమ సంసిద్దత వ్యక్తం చేసింది.


ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

ఏఐ వినియోగం

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐ వినియోగించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురైన అనుభవాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దర్శనం - వసతి ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐ వినియోగిస్తున్నా.. భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటుగా వసతి, వివిధ సేవల కోసం గుగూల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో భక్తులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనే సమాచారం టీటీడీకి అందిస్తారు. దీనికి అనుగుణంగా భవిష్యత్ లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుంది. దర్శన విధి విధానాలు, వస్త్ర ధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావాల్సిన భాషల్లో సమాచారం అందించనున్నారు.


భక్తులకే సమాచారం

ఏఐ కెమేరాలను తిరుమలలో గుగూల్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐ మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక, ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్ లో ఆ భక్తుడు ఆ ఐడీ ద్వారానే దర్శనం.. సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు.. ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలో అయినా టీటీడీకి సమాచారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. భక్తులు సూచనలు, వారి అభిప్రాయాలు, సలహాలను అందించే అవకాశం ఇవ్వనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

 

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTDUpdates #AIservices #PermanentID #DevoteesID #DarshanBooking #TTDdarshan